ముంబై డొమస్టిక్ ఎయిర్ పోర్ట్ లో డొమస్టిక్ నుండి ఇంటర్ నాషనల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళడానికి ఫ్రీ బస్సు సదుపాయం ఉంది . మాకు డైరెక్ట్ టికెట్ ఉండడం మూలాన చెక్ ఇన్ లగేజీ డైరెక్ట్ గా వాళ్లే నెస్ట్ ఫ్లిట్ కి పంపేసారు. మా కాబిన్ లగేజీ ని మాత్రం పట్టుకొని ఎమిగ్రేషణ్ కి వెళ్ళాలి .ఎమిగ్రేషణ్ కోసం ఒక ఫారం ని నింపుకోవాలి . ఈ ఫారం ఏ విమానం లో వెళ్తామో దాని బోర్డింగ్ పాసు తీసు కున్నప్పుడే ఫ్లైట్ నెంబర్ వ్రాసి ఆ ఎయిర్ లైన్స్ వాళ్లే ఇస్తారు. ఎమిగ్రేషణ్ పూర్తి అయ్యాక సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాలి.
ఇక్కదేనండి మళ్ళీ మాకు మరోసారి చావు తప్పి కన్ను లోట్టయింది. సెక్యూరిటి చెక్ కి మన దగ్గరున్న ఎలెక్ట్రోనిక్ వస్తువులన్నీ , అంటే లాప్ టాప్ , మొబైల్ లాంటివి ఒక ట్రే లో పెట్టాలి. జేబూలో ఉన్న పర్సులు , బెల్టులు పెన్నులు కూడా తీసి పెట్టాలి . ఎక్స్ రే అయాక . మళ్ళీ బయట తీసేసు కోవాలి.
ఇవన్నే అయేసరికి సుమారు రాత్రి రెండు గంటలయింది. ఏదో కాస్త కడుపు నింపుకొని చెక్ ఇన్ దగ్గరకి వచ్చాము . " ఏదీ ఆ చర్జేర్ ఇయ్యి . కొంచం ఫోను ఛార్జ్ చేస్తాను అన్నాను" "మళ్ళీ" అని మా ఆవిడ అనడం లోనే ఆవిడ భయం నా కర్ధం అయ్యింది .
" ఫరవా లేదులే " అంటూ ఫోను కోసం వెతికేను. " అయ్య బాబోయ్ ...ఫోను ఎక్కడో జారి పోయి నట్లుంది" " సెక్యూరిటీ చెక్ " అంటూ పరిగెట్టాను . నాతో పాటు మా లుఫ్తాన్సా ఎయిర్ లైన్ సిబ్బంది కూడా ఒకడు పరిగెత్తాడు.
" మై మొబైల్ " అని చెప్పడం తోనే " అవును ఉంది , మీకోసం రెండు అనౌన్సు మెంట్లు కూడ చేసాం.కాని మీదేనని రుజువు చెయ్యాలి . ఎలా " అన్నాడు పోలీసు ఆఫీసర్. " కాంటాక్ట్ లిస్టు చూడండి. అబోడే .. తరువాత ...." అంటూ నాలుగు పేర్లు చెప్పేసరికి ,"ఒకే సంతకం చేసి తీసుకు వెళ్ళండి " అన్నాడు ఎంతో మర్యాదగా..."
ప్రపంచం లో ఇంకా ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు . కాని మనకి కూడా కొంత జాగ్రత్త ఉండాలి. ఇది లెస్సన్ నెంబర్ రెండు .
16, మార్చి 2010, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి