14, మార్చి 2010, ఆదివారం

ముందుగా మూడు ముక్కలు

ఇది యఫ్ యమ్ రేడియో యుగం. జాకీ లో తో మనం అన్నీ పంచుకోవాల్సిందే . మన కష్టాలు , సుఖాలు , బాధలు , భాద్యతలు , కోర్కెలు , ప్రేమలు, ఫైటింగ్లు,ముద్దులూ  ముచ్చట్లు, వినోదాలు, వికారాలు , ఒకటేమిటి. అన్నీ పబ్లిక్ గా చెప్పుకోవడమే.
ఎవరైనా  ఇష్టముంటే వినవచ్చు, చూడొచ్చు. కష్టమైతే కట్టి పడే యొచ్చు. ఎవేరికీ ఇబ్బంది ఉండొద్దు. ఉంటే మాకేమీ ఇబ్బంది లేదు. 
            మేము ఇండియా వదిలేసి యిట్టె  ఐదు రోజులైపోయాయి.మొదటి రెండు రోజులు ప్రయాణం.  తరువాత రెండు రోజులు బడలిక, జెట్ లాగ్. అయినా మా మొదటి రెండు రోజుల పురాణం , అంటే ప్రయాణం ముచ్చట్లు  తప్పకుండా చెప్పుకోవాలి .
మేము ముంబై , ఫ్రాంక్ ఫర్ట్ మీదుగా సాన్ ఫ్రాన్ సిస్కో లో ఉన్న మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి బయలు దేరాము.
మొదటి ఘట్టం 
10.03 .10 :  సుమారు రాత్రి ఎనిమిదిబయలు గంటలకు మా జెట్ ఎయిర్ వేస్ విమానం  బయలు దేరింది. కిటికీ పక్క సీటు మా ఆవిడది , తరవాత నేను. మూడో సీట్లో ఒక విదేశీ యువకుడు . ఎక్కిన అర గంటవరకూ నేనూ మా ఆవిడ ఏవో గుసగుసలు  ఆడు కున్నాం , తప్ప మూడో వ్యక్తి ఒక్క మాట లేదు కదా , మా పక్క చూడలేదు కూడా. మెల్లిగా నేనే మొదలెట్టేను. "అమెరికా?"  
" నో ముంబై " అని ముక్తసరిగా చెప్పి నవ్వేసి , మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. అంతే , ఆయనగారితో జరిగిన  సంభాషణ .
ముంబై వచ్చేసింది. అందరూ లేచి నిలబడి పోయారు. మా పక్కయాన, మేము తప్ప. మా ఆవిడ షనుగుడు ప్రారంభం . " ఇంకా లేవడేంటి ? అందరూ దిగిపోతూ ఉంటే" . " ఫరవా లేదు , మనకి బోల్డు టైం ఉంది". నేను సర్ది చేప్పేను. ఎలాగైతేనేం , మనవాడు లేచేడు . అప్పుడే నాకొక ఫోను. నేను హలో  కేశవ్ అంటూ ఫోను మొదలెట్టడం , ఆయనగారు కాబిన్  లగేజీ  దింపేయడం . క్షణం లో జరిగి పోయయాయి. నేను లేచి ఉన్న రెండు పెట్టెలూ  దింపేను." ఏవండీ ఇది మనది కదండీ , మన పెట్టి వాడు దింపుకు వెళ్లి పోయాడు " మా ఆవిడ ఒక్క సారి అరిచింది. అంతే  మా రెండో పెట్టె పట్టుకొని ఒక్కసారి ఉరేకేను. "స్టాప్ హిం , స్టాప్ హిం అని అరుస్తూ" 
ఆయన అక్కడే విమానం ద్వారం దగ్గరే నిలబడ్ ఉన్నాడు. మా పెట్టె ఆయన పక్కనే ఉంది . " ఐ పిక్క్డ్ ది రాంగ్  వన్"  అదే చిరు  నవ్వు. అదే ముక్తసరి మాట. ఇంకేమీ లేదు . మా ఆవిడా వచ్చి వెంటనే పెట్టె లాగేసింది." మనదే , మనదే ... రెండూ ఒక్క లాగా ఉన్నాయ్ . పిచ్చి వెధవ  చూసుకోవోద్దూ  ఇంకా నయం అన్నే ఇందులోనే ఉన్నాయి పాస్ పోర్ట్ తో సహితం ". నేనేమీ మాటలాడ లేదు .
మోరల్:  ఎక్కేముందు ,దిగేముందు  కనీసం పది నిముషాల ముందు ఫోను ఆపి పెట్టాలి . పాపం వాళ్ళు , చెప్తారు, వినక పోతే  చేడేది మనమే .                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి