27, మార్చి 2010, శనివారం

Asha కోసం 5 K రన్ : 20 .03 .10

Asha ఫర్  ఎడ్యుకేషన్
భారత దేశం లో ప్రాధమిక విద్య కోసం  యూనివెర్సిటీ అఫ్ కాలిఫోర్నియా లో కొందరు విద్యార్ధులు మరియు  అధ్యాపకులు కలిసి
1991 లో ప్రారంభించిన ఒక స్వచ్చంద సేవా సంస్థ. వీరు బడుగు వర్గాల పిల్లల చదువులు కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ  సంస్థ  వారు   కాలిఫోర్నియా , సన్నీ వేల్ లో ఐదు మరియు పది కిలో మీటర్ల పరుగు  నిర్వత్తించేరు. అందులో నేను మా అమ్మాయి కూడా పాల్గొన్నాము . పాల్గొనే ప్రతీవారు $ 25 చెల్లించాలి . ఆ విధంగా సొమ్ము ప్రోగు చేస్తారు .
ఎంతోమంది  వయస్సు తో నిమిత్తం లేకుండా , ఆడా, మగా అన్న బేధం లేకుండా ఒక సేవా ద్రుఖ్పధం తో ఇందులో పాల్గొంటారు.
దీని రిజల్ట్స్ నెట్ లో ప్రచురించారు.

25, మార్చి 2010, గురువారం

ఫిషేర్ మన్స్ వ్హార్ఫ్

ఇది సాన్ ఫ్రాన్సిస్కో లో అతి చక్కటి  ఆహ్లాదక పర్యటనా స్థలం. పీర్ 39   వివిధ రాఖాల సముద్ర ఆహార రెస్టరెంటలకు , సావనీర్ షాపులకు ,వీధి విన్యాసకులకు, పెట్టింది పేరు. దీనికి తోడు మూడు తరాల ఫిషింగ్ బోట్లు మరియు జాలర్ల చరిత్ర  చాటి చెప్పే సాంప్రదాయ శోభ. ప్రోద్దస్తమానం వేల కొలది పర్యాటకులు. చూడ డానికి రెండు కళ్ళు చాలవు. చూపించేందుకు ఒక ఫోటో చాలదు.



24, మార్చి 2010, బుధవారం

B.A.T.A. ఉగాది ఉత్సవాలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ వారు ఉగాది ఉత్సవాలు  మార్చ్ 21 , ఆది వారం సాయంత్రం జరుపు కున్నారు. మేము కూడా కొంత సేపు గడిపేము . ఆట , పాటలతో దుమ్ము లేపేరు . తెలుగు సినిమా ల ప్రభావం ఆంధ్రాలో కన్నా మించి కనిపించింది .మాత్రు భాష కోసం , ఇక్కడి తెలుగు వారి అబిలాష. ఆకాంక్ష చూస్తే ఎంతో ముచ్చట వేసింది . 

ఇంకొన్ని ఫోటోల కోసం ...

ఉగాది వారం

 అమెరికా వాసులు ఉగాది పండుగ  ఒక రోజు జరుపు కోరు. వారి వారి అనుకూలంగా  వారాంతరాల్లో జరుపు కుంటారు. నిజానికి మాకు ఈ ఏడు పండగ లేదు. మా నాన్న గారు పరమపదించి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. కాని ఉగాది మిషగా  పిలిచి మమ్మలిని పరిచయం చెయ్యాలని కోరికతో మా అమ్మాయి తన స్నేహితుల్లో ఓ ముగ్గురు  తెలుగు వారిని మరో ముగ్గురు గుజరాతి వారిని పిలిచింది. అందరం కలిసి చాల బాగా గడిపేము.
    మా ఆవిడ   ఉగాది పచ్చడితో  పాటు పులిహోర , పెరుగు వడలు ,పాయసం , అన్నం ,  సాంబారు , గుత్తి వంకాయ కూర , పూరీ,  కుర్మా చేసింది.
పిల్లలందరూ కలిసి ఎంచక్కా భోజనం చేసి ముచ్చట్లు చెప్పుకున్నారు. వెంకీ తను వ్రాసిన పాట పాడేడు. నేను కూడా నా గేయాలు వినిపించేను. పియూష్ తను కడుపు నిండా తిని మిగతా వారిని కడుపుబ్బేలా నవ్వించేడు. యిట్టె సాయంత్రం గడిచి పోయింది . చెప్పలేని జాపకాల్ని ఎన్నో మిగిల్చింది.      

ఇంకా ఫోటోల కోసం .....

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ : 14 మార్చ్ 2010


గోల్డెన్ గేట్ బ్రిడ్జ్  ప్రపంచం లో ( హౌరా బ్రిడ్జ్ టైపు) సుస్పెంషణ్  బ్రిడ్జీ ల లో అతి పురాతన మైనది, పొడవైనది ,చాలా విశిష్టమైనది.
దీనిని 1937 లో పూర్తి చేసారు. ఇది సాన్ ఫ్రాన్సిస్కో నగరానికీ ,కాలిఫోర్నియా రాష్ట్రానికీ చాలా  ముఖ్యమైన పర్యాటన స్థలం .  ఏడాదికి సుమారుగా 90 లక్షల మంది దీన్ని చూడడానికి వస్తారని అంచనా.

శ్రేయ ఘోషల్ లైవ్ కాంసేర్ట్ : 12 .03 .10

 శంకర ఐ ఫౌండేషన్ ( SEF )  అమెరికా లో నెల కొల్పిన ఒక సేవా సంస్థ . ఇండియా లో నేత్ర కళ్యాణం కోసం కృషి చేస్తున్న వివిధ సేవా సంస్థలకు వీరు సహాయం అందిస్తారు . ఈ SEF లో మా అమ్మాయి కూడా స్వచ్చంద సేవ చేస్తుంది .
వీరు ఈ రోజు  (12 .03 .10 ) ని ఫండ్ రైజింగ్ కోసం  శ్రేయ ఘోషల్ లైవ్ కాంసేర్ట్ జరిపారు . మా అమ్మాయి తో పాటు మేము కూడా కొంత స్వచ్చంద సేవ చేసాము.
కుమారి శ్రేయ ఘోషాల్  మరియు ఆమె బృందం హిందీతో పాటు బెంగాలి , గుజరాతి , తమిళ్ , కన్నడ పాటలని సుమధురంగా ఆలపించి  అందరి మన్నలను పొందారు. అమెరికా లో మేము చూసిన ఈ మొదటి సందడి మరువలేనిది. మరపు రానిది.


16, మార్చి 2010, మంగళవారం

ముంబై ఎయిర్ పోర్ట్

ముంబై డొమస్టిక్  ఎయిర్ పోర్ట్ లో డొమస్టిక్ నుండి ఇంటర్ నాషనల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళడానికి ఫ్రీ  బస్సు సదుపాయం ఉంది .   మాకు డైరెక్ట్ టికెట్ ఉండడం మూలాన  చెక్ ఇన్ లగేజీ డైరెక్ట్ గా వాళ్లే నెస్ట్  ఫ్లిట్ కి పంపేసారు. మా కాబిన్ లగేజీ ని మాత్రం పట్టుకొని ఎమిగ్రేషణ్ కి వెళ్ళాలి .ఎమిగ్రేషణ్ కోసం ఒక  ఫారం ని నింపుకోవాలి . ఈ ఫారం ఏ విమానం లో వెళ్తామో దాని బోర్డింగ్ పాసు తీసు కున్నప్పుడే ఫ్లైట్ నెంబర్ వ్రాసి  ఆ ఎయిర్ లైన్స్ వాళ్లే ఇస్తారు. ఎమిగ్రేషణ్ పూర్తి అయ్యాక సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాలి.
ఇక్కదేనండి మళ్ళీ మాకు మరోసారి చావు తప్పి కన్ను  లోట్టయింది. సెక్యూరిటి చెక్ కి మన దగ్గరున్న ఎలెక్ట్రోనిక్ వస్తువులన్నీ , అంటే లాప్ టాప్ , మొబైల్  లాంటివి ఒక ట్రే లో పెట్టాలి. జేబూలో ఉన్న పర్సులు , బెల్టులు పెన్నులు  కూడా తీసి పెట్టాలి . ఎక్స్ రే అయాక . మళ్ళీ బయట తీసేసు కోవాలి.
ఇవన్నే అయేసరికి సుమారు రాత్రి  రెండు  గంటలయింది. ఏదో కాస్త కడుపు నింపుకొని చెక్ ఇన్ దగ్గరకి వచ్చాము . " ఏదీ ఆ చర్జేర్ ఇయ్యి . కొంచం ఫోను ఛార్జ్ చేస్తాను అన్నాను" "మళ్ళీ" అని మా ఆవిడ అనడం లోనే ఆవిడ భయం నా కర్ధం అయ్యింది .
" ఫరవా లేదులే " అంటూ ఫోను కోసం వెతికేను. " అయ్య బాబోయ్ ...ఫోను ఎక్కడో జారి పోయి నట్లుంది" " సెక్యూరిటీ చెక్ " అంటూ పరిగెట్టాను . నాతో పాటు మా లుఫ్తాన్సా ఎయిర్ లైన్ సిబ్బంది కూడా ఒకడు పరిగెత్తాడు.
" మై మొబైల్ " అని చెప్పడం తోనే " అవును ఉంది , మీకోసం రెండు అనౌన్సు మెంట్లు కూడ చేసాం.కాని మీదేనని రుజువు చెయ్యాలి . ఎలా " అన్నాడు పోలీసు ఆఫీసర్. " కాంటాక్ట్ లిస్టు చూడండి. అబోడే .. తరువాత   ...." అంటూ   నాలుగు పేర్లు చెప్పేసరికి ,"ఒకే సంతకం చేసి తీసుకు వెళ్ళండి " అన్నాడు ఎంతో మర్యాదగా..."
ప్రపంచం లో ఇంకా ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు . కాని మనకి కూడా కొంత జాగ్రత్త ఉండాలి. ఇది లెస్సన్ నెంబర్  రెండు . 

14, మార్చి 2010, ఆదివారం

ముందుగా మూడు ముక్కలు

ఇది యఫ్ యమ్ రేడియో యుగం. జాకీ లో తో మనం అన్నీ పంచుకోవాల్సిందే . మన కష్టాలు , సుఖాలు , బాధలు , భాద్యతలు , కోర్కెలు , ప్రేమలు, ఫైటింగ్లు,ముద్దులూ  ముచ్చట్లు, వినోదాలు, వికారాలు , ఒకటేమిటి. అన్నీ పబ్లిక్ గా చెప్పుకోవడమే.
ఎవరైనా  ఇష్టముంటే వినవచ్చు, చూడొచ్చు. కష్టమైతే కట్టి పడే యొచ్చు. ఎవేరికీ ఇబ్బంది ఉండొద్దు. ఉంటే మాకేమీ ఇబ్బంది లేదు. 
            మేము ఇండియా వదిలేసి యిట్టె  ఐదు రోజులైపోయాయి.మొదటి రెండు రోజులు ప్రయాణం.  తరువాత రెండు రోజులు బడలిక, జెట్ లాగ్. అయినా మా మొదటి రెండు రోజుల పురాణం , అంటే ప్రయాణం ముచ్చట్లు  తప్పకుండా చెప్పుకోవాలి .
మేము ముంబై , ఫ్రాంక్ ఫర్ట్ మీదుగా సాన్ ఫ్రాన్ సిస్కో లో ఉన్న మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి బయలు దేరాము.
మొదటి ఘట్టం 
10.03 .10 :  సుమారు రాత్రి ఎనిమిదిబయలు గంటలకు మా జెట్ ఎయిర్ వేస్ విమానం  బయలు దేరింది. కిటికీ పక్క సీటు మా ఆవిడది , తరవాత నేను. మూడో సీట్లో ఒక విదేశీ యువకుడు . ఎక్కిన అర గంటవరకూ నేనూ మా ఆవిడ ఏవో గుసగుసలు  ఆడు కున్నాం , తప్ప మూడో వ్యక్తి ఒక్క మాట లేదు కదా , మా పక్క చూడలేదు కూడా. మెల్లిగా నేనే మొదలెట్టేను. "అమెరికా?"  
" నో ముంబై " అని ముక్తసరిగా చెప్పి నవ్వేసి , మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. అంతే , ఆయనగారితో జరిగిన  సంభాషణ .
ముంబై వచ్చేసింది. అందరూ లేచి నిలబడి పోయారు. మా పక్కయాన, మేము తప్ప. మా ఆవిడ షనుగుడు ప్రారంభం . " ఇంకా లేవడేంటి ? అందరూ దిగిపోతూ ఉంటే" . " ఫరవా లేదు , మనకి బోల్డు టైం ఉంది". నేను సర్ది చేప్పేను. ఎలాగైతేనేం , మనవాడు లేచేడు . అప్పుడే నాకొక ఫోను. నేను హలో  కేశవ్ అంటూ ఫోను మొదలెట్టడం , ఆయనగారు కాబిన్  లగేజీ  దింపేయడం . క్షణం లో జరిగి పోయయాయి. నేను లేచి ఉన్న రెండు పెట్టెలూ  దింపేను." ఏవండీ ఇది మనది కదండీ , మన పెట్టి వాడు దింపుకు వెళ్లి పోయాడు " మా ఆవిడ ఒక్క సారి అరిచింది. అంతే  మా రెండో పెట్టె పట్టుకొని ఒక్కసారి ఉరేకేను. "స్టాప్ హిం , స్టాప్ హిం అని అరుస్తూ" 
ఆయన అక్కడే విమానం ద్వారం దగ్గరే నిలబడ్ ఉన్నాడు. మా పెట్టె ఆయన పక్కనే ఉంది . " ఐ పిక్క్డ్ ది రాంగ్  వన్"  అదే చిరు  నవ్వు. అదే ముక్తసరి మాట. ఇంకేమీ లేదు . మా ఆవిడా వచ్చి వెంటనే పెట్టె లాగేసింది." మనదే , మనదే ... రెండూ ఒక్క లాగా ఉన్నాయ్ . పిచ్చి వెధవ  చూసుకోవోద్దూ  ఇంకా నయం అన్నే ఇందులోనే ఉన్నాయి పాస్ పోర్ట్ తో సహితం ". నేనేమీ మాటలాడ లేదు .
మోరల్:  ఎక్కేముందు ,దిగేముందు  కనీసం పది నిముషాల ముందు ఫోను ఆపి పెట్టాలి . పాపం వాళ్ళు , చెప్తారు, వినక పోతే  చేడేది మనమే .